చేపల వేటకు వెళ్లి వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా/గంభీరావుపేట0,/అక్టోబర్6(ప్రజా అక్షరం):
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన గంభీరావుపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మల్లుపల్లి గ్రామానికి చెందిన కొమ్ము స్వామి (35),కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.చేపల వేటకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఈ నెల 5న ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు.రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ శివారులో,పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీలభించలేదు.మంగళవారం ఉదయం నాగంపేట గ్రామానికి చెందిన నర్ర రాజిరెడ్డి తన వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి మృతదేహం నీటిపై తేలుతూ ఉందని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.దీంతో స్వామి సోదరుడు రమేష్,కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహం స్వామిదేనని గుర్తించారు.మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు.చేపల వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి నీటిలో మునిగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వామి మృతిపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని పేర్కొన్నారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్. శ్రీకాంత్ తెలిపారు.