🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 07 October 2026, 12:18 pm Posted by : MANA PRAJA AKSHARAM

అంగన్వాడి కేంద్రాలే విద్యకు తొలి మెట్టు...

News Image
రాజాపేట, అక్టోబర్ 6(ప్రజా అక్షరం):
రాజపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మేకల రమేష్ ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాలే విద్యకు తొలిమెట్టుగా భావించి పి ఎం నరేంద్ర మోడీ పిలుపుమేరకు రాజాపేట, రఘునాథపురం అంగన్వాడీ సెంటర్లు సందర్శించి అంగన్వాడీ టీచర్లను, ఆయాలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలే మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా ఉండడం గర్వంగా ఉందన్నారు. అనంతరం మండల స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని, జరగబోయే సేవా సంకల్ప అభ్యాన్ కార్యక్రమానికి రాజపేట నుండి భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేకల రమేష్ , రాజపేట సర్పంచ్ కోయ మధు,కస్తూరి మాధురి చెంద్ర, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కాసోజు సంపత్ పట్టణ అధ్యక్షులు సాధనబోయిన శంకర్ మండల ప్రధాన కార్యదర్శి మెండు భగవాన్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు శేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు గాండ్ల నర్సింగరావు చలమల్లపల్లి లక్ష్మణ్, చిగుళ్ల వీరయ్య, బూత్ అధ్యక్షులు బిరు సురేష్, కాకల్ల సిద్దులు, బూరెళ్ల శ్రీనివాస్, కటికం నర్సిములు, గుజ్జ రామచెంద్రం, భోగ పాండు, బీమనపల్లి రమేశ్, కటికం నగేష్, మహిళా నాయకులు బూర్గు రాణి, బూరెళ్ల శ్రీవాణి,జంగా వెంకటలక్ష్మి,బూర్గు రాణి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home