🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 07 October 2026, 1:02 pm Posted by : MANA PRAJA AKSHARAM

అదనపు అంతస్తులపై మల్కాజిగిరి జోన్ (ఎం ఎం సి) టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు.

News Image
మల్కాజిగిరి అక్టోబర్ 06 ప్రజా అక్షరం
మల్కాజిగిరి జోన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అనధికార నిర్మాణాలు, అదనపు అంతస్తులపై మల్కాజిగిరి జోన్ (ఎం ఎం సి) టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
మౌలాలీ సర్కిల్-4 పరిధిలోని సింహాద్రి నగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అనధికార నిర్మాణాన్ని ఎం ఎం సి సిబ్బంది కూల్చివేశారు.
అదేవిధంగా మల్కాజిగిరి సర్కిల్ 05 పరిధిలో
ప్రశాంత్ నగర్, పి.వి.ఎన్
కాలనీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తులను,(ఎక్స్ట్రా ఫ్లోర్) కూల్చివేసి పనులను నిలిపివేశారు.
అధికారులు మాట్లాడుతూ:
మల్కాజిగిరి జోన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
భవన నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా (ఎం ఎం సి )నుంచి ముందస్తు అనుమతులు పొందాలని స్పష్టం చేశారు.
అనుమతి పొందిన ప్లాన్‌‌కు భిన్నంగా అదనపు అంతస్తులు వేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
ఈ కూల్చివేతల కార్యక్రమంలో ఎం ఎం సి మౌలాలి ఉప కమిషనర్ (డి.సి) బాలకృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏ.సీ.బీ) శ్రీనివాసరావు మరియు సిబంది పాల్గొన్నారు.
🏠 Home