🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 07 October 2026, 1:04 pm Posted by : MANA PRAJA AKSHARAM

ఇంటింటా ఇంకుడు గుంతలపై విస్తృత అవగాహన కల్పించాలి

News Image
ప్రజా అక్షరం,రామగుండం (ప్రతినిధి) అక్టోబర్ 6:-
జల సంచయ్,జన భగీధారీ పథకంలో భాగంగా ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణ శ్రీ మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేటు ఇళ్ల యజమానులకు భూగర్భ జలాలను పరిరక్షించడానికి ఇంకుడు గుంతల నిర్మాణ ఆవశ్యకతను వివరించాలని, ప్రతి స్వశక్తి సంఘ సమావేశానికి వార్డు అధికారులు హాజరై ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించాలని అన్నారు.హోర్డింగ్ లు కూడా ప్రదర్శించాలని అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో,కమ్యూనిటీ బోర్ బావుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడానికై చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వo నిర్దేశించిన గడువు లోపు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకుడు గుంతల నిర్మాణం వేగంగా చేపట్టి సంబందిత వెబ్ సైటు లో ఎప్పటికప్పుడు ఫోటో లు అప్ లోడ్ చేయాలని తెలిపారు.ఆర్థిక సంవత్సరం మూడో త్రై మాసికంలో ప్రవేశించినందున మార్చి లోగా 100 శాతం లక్ష్యం చేరుకోవడానికి ఆస్తి పన్ను, నల్లా బిల్లు,ట్రేడ్ లైసెన్స్ రుసుం వసూళ్లలో వేగం పెంచాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి,టిపిఓ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్,ఆర్ఐ ఖాజా, సీనియర్ అసిస్టెంట్ సాగర్, జూనియర్ అసిస్టెంట్ లు సౌమ్య,నరేష్,వార్డు అధికారులు,అసిస్టెంట్ లు పాల్గొన్నారు.
🏠 Home