తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఆడబిడ్డల ఆత్మీయ వేడుక.. బతుకమ్మ పండుగ!

హైదరాబాద్ అక్టోబర్ 10(ప్రజా అక్షరం):
తెలంగాణ ఆడబిడ్డల అతిపెద్ద పండుగ, సింగిడి రంగుల పూల సంబరం బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ, ప్రకృతి అందాలను పూలలో కొలువుదీర్చే ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాలను, ప్రతి గుండెలో సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.
గౌరమ్మ తల్లి ఆశీస్సులతో ఆడబిడ్డలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా కోరుకున్నారు.