🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 10 October 2026, 8:34 pm Posted by : MANA PRAJA AKSHARAM

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఏజెర్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి

News Image
ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఏజెర్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి

వలిగొండ అక్టోబర్ 10 ప్రజా అక్షరం ప్రతినిధి):

ఆడపడుచులందరికీ ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే గొప్ప సంప్రదాయం మన బతుకమ్మ పండుగ గొప్పతనమని అన్నారు.వాడవాడలా జరుగుతున్న బతుకమ్మ వేడుకలు మన ఐక్యతకు, మన సంస్కృతికి నిదర్శనమని, రాబోయే తొమ్మిది రోజులు అందరూ కలిసికట్టుగా, సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఆడబిడ్డలందరికీ సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
🏠 Home