🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 10:37 am Posted by : MANA PRAJA AKSHARAM

ఎల్ నీనో పై రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్

News Image
ఎల్ నీనో పై రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్



తుర్కపల్లి ,అక్టోబర్ 12 ప్రజా అక్షరం న్యూస్


తుర్కపల్లి మండలం దత్తాయ పల్లి గ్రామంలోని రైతు వేదిక నందు ఎల్నినో సమస్య ,నీటి ఎద్దడి వర్షాభావ పరిస్థితులపై రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ను అధికారులు వీక్షించారు .ఈ సందర్భంగా జిల్లా డిఆర్డిఓ నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలను వేయాలని, వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కె జానయ్య మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. నీటిని వృధా చేయకుండా ప్రజలు నీటి వినియోగాన్ని తగ్గించి అవసరాలకు మించి వాడకూడదని అన్నారు .నేటి నీటి సంరక్షణ రేపటి భవిష్యత్తు తరాలకు నీటిని అందించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చాడ భాస్కర్ రెడ్డి, బుజ్జవానికుంట తండా సర్పంచ్ గుగులోతు ధూప్ సింగ్ నాయక్ , ఏపీవో నారాయణ, ఏఈవోలు ,అధికారులు, రైతులు పాల్గొన్నారు.
🏠 Home