🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 10:47 am Posted by : MANA PRAJA AKSHARAM

ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

News Image
*ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి*

*కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు*

రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/అక్టోబర్12(ప్రజా ఆక్షరం)

ఎన్నికల చోరీకి పాల్పడిన ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు డిమాండ్ చేశారు,రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు,ఎన్నికల కమీషనర్ మరియు కేంద్రప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు,బైకు ర్యాలీ గంభీరావుపేట నుండి ముస్తఫానగర్,దమ్మన్నపేట,గోరంటల,రాజేశ్వరరావు నగర్,సముద్రలింగపూర్ ల మీదుగా సిరిసిల్ల వరకు కొనసాగింది,ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం తో కుమ్మక్కు అయి కోట్లమంది సాధారణ ప్రజల ఓట్లు చోరీ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు,రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పర్శ హన్మాండ్లు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి. మాజీ మండల అధ్యక్షులు హమీద్, నాయకులు రాజనరసింహ రెడ్డి,గంగీ స్వామి,మెడభాస్కర్,నుస్రతుల్లా హుస్సేనీ,నర్సింలు,ఆజం,రవి,అజ్మీర భాస్కర్ నాయక్,బాల్ రెడ్డి,సంతోష్ గౌడ్,దుర్గయ్య,రామచంద్ర రెడ్డి,రాజు,యాదా గౌడ్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు,
🏠 Home