🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 1:38 pm Posted by : MANA PRAJA AKSHARAM

Gen Z అంటే బీజేపీకి భయమా?”*

News Image
ముఖ్యమైన పాయింట్స్:Gen Z అంటే బీజేపీకి భయమా?”*:- యువత హక్కుల కోసం పోరాటం ఆగదు:-పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
*“Gen Z అంటే బీజేపీకి భయమా?”*

:- యువత హక్కుల కోసం పోరాటం ఆగదు

:-పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ప్రజా అక్షరం ప్రతినిధి, రామగుండం,అక్టోబర్ 12 :-

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత ఓటు హక్కుల పరిరక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన పోరాటానికి మద్దతు తెలిపిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21, 22 కల్పించిన హక్కుల ప్రకారం శాంతియుత నిరసన ప్రతి పౌరుడి హక్కు అని స్పష్టం చేశారు.దాదాపు 40 వేల మంది పోలీసులతో విద్యార్థులు,యువతపై అణచివేతకు పాల్పడటం దారుణం అని విమర్శించారు. ఫస్ట్ టైమ్ ఓటర్ల ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తూ,సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.“రాహుల్ గాంధీ నాయకత్వంలో యువత హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాడతాం” అని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
🏠 Home