🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 26 October 2026, 6:46 pm Posted by : MANA PRAJA AKSHARAM

ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కి మా సంఘానికి సంబంధం లేదు : కూనూరు సంజయ్ దాస్ గౌడ్

News Image
ముఖ్యమైన పాయింట్స్:ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కి మా సంఘానికి సంబంధం లేదు : కూనూరు సంజయ్ దాస్ గౌడ్
*ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కి మా సంఘానికి సంబంధం లేదు*
*కూనూరు సంజయ్ దాస్ గౌడ్*

చిట్యాల, అక్టోబర్ 26 (ప్రజా అక్షరం ప్రతినిధి):

కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యమంత్రి నివాసం ముట్టడి పిలుపు కార్యక్రమానికి, మా యొక్క సంఘం తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని వ్యవస్థాపక అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,మా సంఘానికి చెందిన నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద వేణుగోపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు లింగస్వామి లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
శాంతియుతంగా ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేసే మా సంఘం నాయకులని ప్రజాస్వామ్యంలో ముందస్తు అరెస్టులు సరి కాదన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అని సంజయ్ దాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఎంతో గౌరవంగా చూసుకుంటుందని మా సమస్యల పరిష్కారానికి వారు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, వారి నాయకత్వంపై మాకు పూర్తి విశ్వాసం ఉన్నదని ఇప్పటి కే ప్రభుత్వ సలహాదారు కే. కేశవ రావు నేతృత్వంలో కమిటీ పనిచేస్తుందన్నారు. కావున కొందరు చేస్తున్న ముట్టడి పిలుపులను మా సంఘం సమర్ధించదని, ఉద్యమకారుల ఐక్యత కోసం సంక్షేమం కోసం మేము ప్రభుత్వంతో చర్చల ద్వారానే ముందుకు వెళ్తామని సంజయ్ దాస్ గౌడ్ అన్నారు..
🏠 Home