🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 7:50 am Posted by : MANA PRAJA AKSHARAM

సినీ సంగీత దర్శకుడునీ ఘనంగా సన్మానించిన సంజయ్ దాస్ గౌడ్.

News Image
ముఖ్యమైన పాయింట్స్:సినీ సంగీత దర్శకుడునీ ఘనంగా సన్మానించిన సంజయ్ దాస్ గౌడ్.*
*సినీ సంగీత దర్శకుడునీ ఘనంగా సన్మానించిన సంజయ్ దాస్ గౌడ్.*

*చిట్యాల,అక్టోబర్ 28 (ప్రజా అక్షరం ప్రతినిధి):*


'గరివిడి లక్ష్మి' సినిమా విజయవంతమైన సందర్భంగా, పూలే జాతీయ సేవా పురస్కారం అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు చరణ్ అర్జున్ (చిన్ని చరణ్) ను తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బుధవారం హైదరాబాదులోని చరణ్ అర్జున్ స్టూడియోలో కేక్ కట్ చేసి, శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సంజయ్ దాస్ మాట్లాడుతూ,
తెలంగాణ మట్టి బిడ్డ అయిన చరణ్ అర్జున్ నల్లగొండ జిల్లా మేళ్ళదుప్పలపల్లి గ్రామానికి చెందిన చరణ్ అర్జున్ తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీతం అభ్యసించిన ఆయన, కేవలం 18 ఏళ్ల వయసులోనే 2003లో రాజశేఖర్ నటించిన 'ఆయుధం' చిత్రంలో _"ఇదేమిటమ్మా మాయా..."_ పాటతో సినీ రంగ ప్రవేశం చేశారని అనంతరం యువన్ శంకర్ రాజా, మణిశర్మ వంటి ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పనిచేసి, లారెన్స్ స్టైల్, నాగార్జున 'డాన్' (2006) విమానం, లగ్గం, గరివిడి లక్ష్మి (2025-26) వంటి చిత్రాలకు సంగీతం అందించి తెలంగాణ జానపద బాణీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో "కెసిఆర్ "ఏ తల్లి పిల్లోడు"ఫేమ్ గాయని,వొల్లల వాణి అక్క,నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ డా. టి.జి. లింగం గౌడ్ తదితరులు పాల్గొని చరణ్ అర్జున్ ను అభినందించారు.
🏠 Home