🏠 manaprajaaksharam.online
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 8:29 am Posted by : MANA PRAJA AKSHARAM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి

News Image
*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి*

*చిట్యాల,అక్టోబర్ 31 (ప్రజా అక్షరం ప్రతినిధి):*

భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ వర్ధంతిని చిట్యాల పట్టణ కేంద్రంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోకల దేవదాస్, చిట్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎద్దులపురి కృష్ణ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి లు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రతను కాపాడేందుకు ఇందిరాగాంధీ చేసిన కృషి దేశాభివృద్ధికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని, దేశం కోసం ఆమె చేసిన త్యాగాలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులు, మండల పార్టీ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య, జిల్లా నాయకులు పాటి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు గాలి యాదమ్మ లింగయ్య, కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, నాగిళ్ల సుధాకర్, జేరిపోతుల సత్యనారాయణ, బొబ్బలి సందీప రామ్ రెడ్డి, దేశపాక లతా రాజేష్, కో ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, పాటి అరుణ మాధవరెడ్డి, ఎస్ కే ఇమ్రాన్, ఎస్.కె షహజాజి ఇబ్రహీం కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు చొల్లేటి శ్రీకాంత్, పోకల ఏసురత్నం, అవురండి సుందర్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
🏠 Home