ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి పోరాటం
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ భవన్ నుంచి ర్యాలీలో.. రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి పోరాటం.
తెలంగాణ భవన్ నుంచి ర్యాలీలో.. రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.
ఢిల్లీ నవంబర్ 2 (ప్రజా అక్షరం డెస్క్) :
దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ఓట్ చోర్ – దేశ్ బచావో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆలేరు నియోజకవర్గం నుంచి సుమారు 99 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో బీర్ల అయిలయ్య గారు పాల్గొని, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన నినాదాలతో ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అనంతరం న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన ఇండియా కూటమి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి చేస్తున్న డిమాండ్‌కు మద్దతుగా నిర్వహించిన ఈ సభలో పాల్గొని తమ గళాన్ని వినిపించారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఓటు చోరీ ఆరోపణలు, ఎన్నికల వ్యవస్థలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజల ఓటు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు.
ఆలేరు నియోజకవర్గం నుంచి సుమారు 99 మంది నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తనతో కలిసి ఢిల్లీకి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని బీర్ల అయిలయ్య తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ శ్రేణులు భాగస్వాములవుతాయని పేర్కొన్నారు.
ఓటు హక్కు పరిరక్షణ.. ప్రజాస్వామ్య పునాదుల బలోపేతమే లక్ష్యంగా ఓట్ చోర్ – దేశ్ బచావో కార్యక్రమంలో ఆలేరు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నామని బీర్ల అయిలయ్య తెలిపారు.