మళ్లీ చల్లూరు గుట్టలపై క్రషర్ దందా!
రాజాపేట, అక్టోబర్ 6(ప్రజా అక్షరం): రాజాపేట మండలంలోని చల్లూరు శివారులోని 322 సర్వే నంబర్ పరిధిలో ఉన్న గుట్టల్లో క్రషర్ పనులు మళ్లీ కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నిలిపివేసిన పనులను తాజాగా గుట్టుచప్పుడు కాకుండా తిరిగి ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే పనులు కొనసాగిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టలను కొంతమంది కేవలం ధనార్జనే ధ్యేయంగా తవ్వకాలు చేపట్టి కొల్లగొడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టలను తొలిచేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు భవిష్యత్లో గ్రామ పరిసరాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రషర్...