ఓటు చోరీ చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు

ప్రజా అక్షరం,రామగుండం (ప్రతినిధి) అక్టోబర్ 6 :- కేంద్ర ప్రభుత్వ తీరుపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు నిరంకుశ పాలనను తలపిస్తున్నాయని ఆరోపించారు.దేశంలో ఎన్నికల వ్యవస్థ,ఓటర్ల హక్కుల పరిరక్షణపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఓట్లు గెలవలేక చీటింగ్ చేసి పరీక్షలో పాస్ అయినట్టుగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నిజమైతే ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య సంక్షోభంగా మారుతుందని,13 కోట్ల మంది ఓటర్ల హక్కులను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయని,ఓటు హక్కును ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరిగితే...