అంగన్వాడి కేంద్రాలే విద్యకు తొలి మెట్టు...
రాజాపేట, అక్టోబర్ 6(ప్రజా అక్షరం): రాజపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మేకల రమేష్ ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాలే విద్యకు తొలిమెట్టుగా భావించి పి ఎం నరేంద్ర మోడీ పిలుపుమేరకు రాజాపేట, రఘునాథపురం అంగన్వాడీ సెంటర్లు సందర్శించి అంగన్వాడీ టీచర్లను, ఆయాలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలే మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా ఉండడం గర్వంగా ఉందన్నారు. అనంతరం మండల స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని, జరగబోయే సేవా సంకల్ప అభ్యాన్ కార్యక్రమానికి రాజపేట నుండి భారీ...