ముచర్ల అంగన్‌వాడీ కేంద్రంలో గ్రోత్ మానిటరింగ్ డే
రాజన్న సిరిసిల్ల జిల్లా/గంభీరావుపేట/అక్టోబర్6(ప్రజా అక్షరం): పోషణ మాసంలో భాగంగా లింగన్నపేట సెక్టార్ పరిధిలోని ముచర్ల అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం గ్రోత్ మానిటరింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా లోపపోషణతో బాధపడుతున్న పిల్లల బరువు,ఎత్తును మరోసారి పరిశీలించారు.అవసరమైన పిల్లలను కరీంనగర్‌లోని ఎన్‌ఆర్‌సీకి ఆర్‌బీఎస్‌కే వాహనం ద్వారా పంపించనున్నట్లు తల్లిదండ్రులకు తెలియజేసి, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించగా,గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ నక్క ప్రశాంత్,స్పెషల్ ఆఫీసర్ హనుమంత నాయక్,ఎంపీడీవో రాజేందర్,ఎంపీవో శ్రీనివాస్,ఐసీడీఎస్ ఏసీడీపీవో ఉమారాణి,సీహెచ్‌వో రాజేందర్,సూపర్‌వైజర్ స్వరూప,వార్డు సభ్యులు,ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం,ఏఎన్‌ఎం,అంగన్‌వాడీ టీచర్లు అనిత,లక్ష్మి,సుకన్య,ఆశా కార్యకర్తలు,తల్లులు, గర్భిణులు,బాలింతలు,కిశోర బాలికలు పాల్గొన్నారు.