బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక
గజ్వేల్: అక్టోబర్6 (ప్రజా అక్షరం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, మహిళల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి గొప్పతనానికి ప్రతీక అని అన్నారు. పూలను అందంగా పేర్చి బతుకమ్మను తయారు చేసి భక్తిశ్రద్ధలతో పూజించడం మన పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప సంప్రదాయమన్నారు. బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ప్రకృతిని గౌరవించడం, సంప్రదాయాలను...