పట్టభద్రుల ఓటు నమోదు చేసుకున్న దైద రవీందర్ దంపతులు
మన ప్రజా అక్షరం /నకిరేకల్, అక్టోబర్ 05: నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటు నమోదులో భాగంగా నకిరేకల్ తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ తన సతీమణి స్వప్న తో కలిసి పట్టభద్రుల ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. నకిరేకల్ తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ యశ్వంత్ సమక్షంలో వారు ఓటు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ దంపతులు మాట్లాడుతూ ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక ఆయుధమని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటును నమోదు చేసుకొని తమ...