అదనపు అంతస్తులపై మల్కాజిగిరి జోన్ (ఎం ఎం సి) టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
మల్కాజిగిరి అక్టోబర్ 06 ప్రజా అక్షరం మల్కాజిగిరి జోన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అనధికార నిర్మాణాలు, అదనపు అంతస్తులపై మల్కాజిగిరి జోన్ (ఎం ఎం సి) టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. మౌలాలీ సర్కిల్-4 పరిధిలోని సింహాద్రి నగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అనధికార నిర్మాణాన్ని ఎం ఎం సి సిబ్బంది కూల్చివేశారు. అదేవిధంగా మల్కాజిగిరి సర్కిల్ 05 పరిధిలో ప్రశాంత్ నగర్, పి.వి.ఎన్ కాలనీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తులను,(ఎక్స్ట్రా ఫ్లోర్) కూల్చివేసి పనులను నిలిపివేశారు. అధికారులు మాట్లాడుతూ: మల్కాజిగిరి జోన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భవన...