ఇంటింటా ఇంకుడు గుంతలపై విస్తృత అవగాహన కల్పించాలి
ప్రజా అక్షరం,రామగుండం (ప్రతినిధి) అక్టోబర్ 6:- జల సంచయ్,జన భగీధారీ పథకంలో భాగంగా ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణ శ్రీ మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేటు ఇళ్ల యజమానులకు భూగర్భ జలాలను పరిరక్షించడానికి ఇంకుడు గుంతల నిర్మాణ ఆవశ్యకతను వివరించాలని, ప్రతి స్వశక్తి సంఘ సమావేశానికి...