8వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం
ప్రజా అక్షరం,రామగుండం (ప్రతినిధి) అక్టోబర్ 6 :- రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 8వ డివిజన్ లోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివిజన్ కార్పొరేటర్ పర్లపల్లి పుష్పలత బాబు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు,చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.తల్లులు,పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రజిత,రమాదేవి, విజయలక్ష్మి,సూపర్వైజర్ జమున తదితరులు పాల్గొన్నారు.