పంటలను కాపాడేందుకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలి

- దౌల్తాబాద్‌లో శివాజీ చౌరస్తాలో అన్నదాతల ధర్నా.. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు. దౌల్తాబాద్‌ అక్టోబర్ 7(ప్రజా అక్షరం ) వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. బుధవారం శివాజీ చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించి విద్యుత్‌ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో పంటలకు సకాలంలో నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న పంటలకు నీరు అందడం లేదని తెలిపారు. కరెంటు ఎప్పుడు...