స్పెషల్ క్యాంపెయిన్ 6.0 లో భాగంగా స్వచ్ఛతా కార్యక్రమం
ప్రజా అక్షరం,రామగుండం (ప్రతినిధి) అక్టోబర్ 6 :- మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశాల ప్రకారం సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్ 2 నుండి 31 వరకు తలపెట్టిన స్పెషల్ క్యాంపెయిన్ 6.0 - డిస్పోజల్ ఆఫ్ ఈ-వేస్ట్ లో భాగంగా రామగుండం ఏరియా.1 జీఎం కార్యాలయ ప్రాంగణంలో ఎన్విరాన్మెంట్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడము జరిగినది.ఈ కార్యక్రమానికి ఆర్జీ.1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ పాల్గొని ఉద్యోగులతో కలిసి పనికిరాని,పాడైన,ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను (ఈ-వేస్ట్) సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలలో వేయడం జరిగినది.అలాగే జీఎం తో పాటు జీఎం కార్యాలయ...