హైదరాబాద్‌లో 111 మెడికల్ షాపులపై టీజీ సేఫ్ కొరడా

హైదరాబాద్‌లోని చార్మినార్,మెహదీపట్నం,టోలిచౌకి,మలక్‌పేట,గోషామహల్ ప్రాంతాల్లో అక్టోబర్ 6న టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ట్రామడాల్,టాపెంటడాల్,నైట్రాజెపామ్,ప్రెగాబాలిన్,జోల్పిడెమ్,అల్ప్రాజోలం,కోడైన్ ఆధారిత దగ్గు సిరప్‌ల అక్రమ విక్రయాలు,మళ్లింపుపై తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో 111 మెడికల్ షాపుల్లో అవకతవకలు గుర్తించారు.సంబంధిత దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా,డ్రగ్ లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దు వరకు చర్యలు ఉండొచ్చని టీజీ సేఫ్ తెలిపింది.