కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి
హైదరాబాద్,ప్రజా అక్షరం అక్టోబర్ 7 హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని సంఘం పేర్కొంది. కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు తగిన పరిహారం అందించాలని కోరింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎకరాకు రూ.30 వేల పంట నష్టపరిహారం, ప్రతి కుటుంబానికి అదనంగా 50 రోజుల ఉపాధి హామీ పని కల్పించాలని సంఘం డిమాండ్ చేసింది. అలాగే తాగునీరు, పశువుల మేత వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని...