యోగ ధ్యాన మందిరానికి మౌలిక వసతులు కల్పించాలని వినతి

చిట్యాల, అక్టోబర్ 7 (ప్రజా అక్షరం ప్రతినిధి): ఋషి సంస్కృతి యోగ సేవా కేంద్రంలోని నిత్య సాధన యోగ ధ్యాన సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిత్య యోగ ధ్యాన సాధకులు చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, మున్సిపల్ కమిషనర్‌ ఉప్పల గురులింగం కు వినతిపత్రాలు అందజేశారు. నిత్య సాధన యోగ ధ్యాన మందిరం కమిటీ అధ్యక్షుడు మాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాధకులు ఈ వినతిపత్రాలను అందజేశారు. యోగ కేంద్రం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు అమర్చాలని, యోగ కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని వారు కోరారు. ప్రస్తుతం యోగ సాధకుల ñసంఖ్యకు అనుగుణంగా హాల్...