లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు.

చెట్ల నర్సంపల్లి చౌరస్తా వద్ద లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు. దౌల్తాబాద్ అక్టోబర్ 10(ప్రజా అక్షరం ) దౌల్తాబాద్ మండలంలోని చెట్ల నర్సంపల్లి గ్రామ శివారులో గజ్వేల్ హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందుప్రియల్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో నర్సంపల్లి చౌరస్తా సమీపంలో రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు....