24 గంటల విద్యుత్ అందించి రైతులను ఆదుకోండి

24 గంటల విద్యుత్ అందించి రైతులను ఆదుకోండి పొలంలో ఎడ్లను మేపుతూ రైతుల నిరసన చేర్యాల అక్టోబర్ 11(ప్రజా అక్షరం): రైతాంగానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందించి ఆదుకోవాలని బాధిత రైతులు శనివారం మండలంలోని ఆకునూరు గ్రామంలో ఎండిపోయిన వరి చేనులో ఎడ్లను మేపుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు కంతుల నర్సయ్య మాట్లాడుతూ.. తాను పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని, లక్షల్లో పెట్టుబడులు పెట్టి పండిస్తున్న వరి పంట చేతికందే దశలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక నీళ్లు పారగా పొలం పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి రైతుల ఇబ్బందులను...