చిట్యాల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం
*చిట్యాల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం:* *చిట్యాల, అక్టోబర్ 12 (ప్రజా అక్షరం ప్రతినిధి):* రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు నేరాల నియంత్రణపై నిరంతరం నిఘా ఉంచాలని యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేసి, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనల...