విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించిన సంజయ్ దాస్ గౌడ్

ముఖ్యమైన పాయింట్స్:విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించిన సంజయ్ దాస్ గౌడ్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించిన సంజయ్ దాస్ గౌడ్ *చిట్యాల, అక్టోబర్ 29 (ప్రజా అక్షరం ప్రతినిధి): చిట్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 38 మంది విద్యార్థుల పరీక్ష ఫీజులను తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ చెల్లించారు. వరుసగా రెండో సంవత్సరం విద్యార్థులకు ఫీజులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో చదివి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సహకారం అందించిన సంజయ్ దాస్ గౌడ్‌కు ప్రధానోపాధ్యాయురాలు బోడ...