కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి* *చిట్యాల,అక్టోబర్ 31 (ప్రజా అక్షరం ప్రతినిధి):* భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ వర్ధంతిని చిట్యాల పట్టణ కేంద్రంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోకల దేవదాస్, చిట్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎద్దులపురి కృష్ణ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి లు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రతను కాపాడేందుకు ఇందిరాగాంధీ చేసిన కృషి దేశాభివృద్ధికి ఆమె...