తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
*తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి* *చిట్యాల,అక్టోబర్ 31 (ప్రజా అక్షరం ప్రతినిధి):* తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి ప్రతి గింజను కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణాంగానే కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యం తడిసిందని ఆయన ఆరోపించారు. శనివారం చిట్యాలలోని ఉరుమడ్ల రోడ్డులో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యమే ధాన్యం తడవడానికి కారణమని అన్నారు....