ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది..
*ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది..* *ఎమ్మెల్యే వేముల వీరేశం* *చిట్యాల, అక్టోబర్ 31 (ప్రజా అక్షరం ప్రతినిధి):* మండలంలోని ఉరుమడ్ల, పిట్టంపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాలో వీలైనంత త్వరగా...