ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్య
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్య చిట్యాల నవంబర్ 1 (ప్రజా అక్షరం ప్రతినిధి): చిట్యాలమున్సిపల్ పరిధిలోని 3 వ వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్య ఎన్నికల ఇచ్చిన హామీలో భాగంగా ఆడపిల్ల వివాహ కానుకగా 10,116 రూపాయలు ఇస్తానన్న హామీ మేరకు ఆదివారం సామ లక్ష్మీ పాపిరెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన బూరుగుయాదయ్య- వరమ్మ కుమార్తె పూజ వివాహానికి హాజరై 10,116రూపాయలు అందజేశారు.