మండల ప్రజలకు అందని హెచ్‌పీ గ్యాస్..
గ్యాస్ కోసం రెండు నెలలుగా ఎదురుచూపులు మండల ప్రజలకు అందని హెచ్‌పీ గ్యాస్.. వినియోగదారుల అవస్థలు ఏడాదిగా నిలిచిన సరఫరా.. సిలిండర్ కోసం ఐదు కిలోమీటర్ల ప్రయాణం పనులు మానుకొని వెళ్లినా దొరకని గ్యాస్ బండ.. పట్టించుకోని అధికారులు రాజాపేట నవంబర్ 1(ప్రజా అక్షరం): రాజాపేట మండలంలోని గ్రామాలకు హెచ్‌పీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో యాదగిరిగుట్ట గ్యాస్ ఏజెన్సీ ద్వారా గ్రామానికి సిలిండర్లు సరఫరా అయ్యేవి. అయితే గ్రామాలకు బచ్చన్నపేట మండలం లింగంపల్లి పరిధిలోని గ్యాస్ ఏజెన్సీకి మార్చినప్పటి నుంచి సమస్య మొదలైంది. ఏడాదిగా గ్రామానికి సక్రమంగా హెచ్‌పీ గ్యాస్ సరఫరా కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్...