తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలి

తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలి అధికారులకు ఫోన్ చేసి ఆదేశించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం: చిట్యాల, నవంబర్ 01 (ప్రజా అక్షరం ప్రతినిధి): చిట్యాల పట్టణంలోని ఊరుమడ్ల రైల్వే గేట్ సమీపంలో రైతులు ఆరబోసిన ధాన్యం రాశులు రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గౌరవ వేముల వీరేశం స్థానిక కాంగ్రెస్ నాయకులను సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.దీంతో అక్కడికి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోకల దేవదాస్ ఆధ్వర్యంలో వెళ్లిన కాంగ్రెస్ నాయకులు...