Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అనుమతుల్లేకుండానే అక్రమ నిర్మాణం?

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 13 Oct 2026, 06:46 PM | తెలంగాణ, సిద్దిపేట
అనుమతుల్లేకుండానే అక్రమ నిర్మాణం?

అనుమతుల్లేకుండానే అక్రమ నిర్మాణం?

అనుమతులపై విచారణ చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి

అనుమతుల్లేకుండానే అక్రమ నిర్మాణం? - Additional Image


దౌల్తాబాద్‌,అక్టోబర్ 13( ప్రజా అక్షరం )

ఇవి కూడా చదవండి

దౌల్తాబాద్ పట్టణంలోని గజ్వేల్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆనుకొని కోళ్ల పెంపకం కోసం షెడ్డు నిర్మించిన అంశం చర్చనీయాంశంగా మారింది. సదరు నిర్మాణానికి గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకున్నారా లేదా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణం చేపట్టారా అనే విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? సంబంధిత నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.