Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు.

లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు.

చెట్ల నర్సంపల్లి చౌరస్తా వద్ద లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 10(ప్రజా అక్షరం )

దౌల్తాబాద్ మండలంలోని చెట్ల నర్సంపల్లి గ్రామ శివారులో గజ్వేల్ హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందుప్రియల్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో నర్సంపల్లి చౌరస్తా సమీపంలో రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించి మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

- చౌరస్తా వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి.

చెట్ల నర్సంపల్లి చౌరస్తా సమీపంలోని గజ్వేల్ హైవేపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌరస్తా వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు, రోడ్డు దాటే వారికి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.