Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పంటలను కాపాడేందుకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలి

పంటలను కాపాడేందుకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలి

- దౌల్తాబాద్‌లో శివాజీ చౌరస్తాలో అన్నదాతల ధర్నా.. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు.

దౌల్తాబాద్‌ అక్టోబర్ 7(ప్రజా అక్షరం )

పంటలను కాపాడేందుకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలి - Additional Image

వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. బుధవారం శివాజీ చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించి విద్యుత్‌ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో పంటలకు సకాలంలో నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న పంటలకు నీరు అందడం లేదని తెలిపారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, విద్యుత్‌ కోసం రాత్రివేళల్లో సైతం పొలాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికే పంటల సాగు కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టామని, విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోతే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని కోరారు. వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు.
రైతులు శివాజీ చౌరస్తాలో రోడ్డుపై ధర్నా చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల ఆందోళనతో కొద్దిసేపు దౌల్తాబాద్‌ ప్రధాన రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి