Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పెద్దకాపర్తిలో ఉచిత మెగా రక్తదాన, వైద్య శిబిరం

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 07 Oct 2026, 12:13 PM | తెలంగాణ
పెద్దకాపర్తిలో ఉచిత మెగా రక్తదాన, వైద్య శిబిరం

మన ప్రజా అక్షరం /రామన్నపేట, అక్టోబర్ 05: రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచేందుకు రక్త నిల్వలను పెంచాలనే లక్ష్యంతో పెద్దకాపర్తి గ్రామంలో ఉచిత మెగా రక్తదాన, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.రామన్నపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ లయన్ కె.వి. ప్రసాద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ డా. భాస్కర్ రావు, కార్యదర్శి లయన్ మహమ్మద్ ఉస్మాన్, కోశాధికారి లయన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ యశోద హాస్పిటల్ మలక్ పేట వారి సౌజన్యంతో షుగర్, ర్యాండమ్ షుగర్, ఈసీజీ, 2డీ ఎకో, కంటి పరీక్షలు, రక్తదానం వంటి సేవలను అందించామని తెలిపారు. డా. రవితేజ, రేవంత్, దుర్గశ్రీ, నీహారికలు గ్రామస్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని పేర్కొన్నారు.అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి సహాయం అందించడమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్న రామన్నపేట లయన్స్ క్లబ్ ప్రతినిధులను రీజినల్ చైర్ పర్సన్ లయన్ ఇంద్రసేనా రెడ్డి గుర్రం, లయన్ యాదమ్మ, చార్టర్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి యపాల, మర్రి గోపాల్ రెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, కాకులరపు బొర్రారెడ్డి, గ్రామస్థులు అభినందించారు.ఐ డొనేషన్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, టెక్నీషియన్ జానీ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, మాజీ సర్పంచులు కందిమళ్ళ శిశుపాల్ రెడ్డి, మర్రి జలంధర్ రెడ్డి, ఓర్సు సైదులు, నీలకంఠం లింగస్వామి, ఏర్పుల నర్సింహ, ఆనగంటి నరేష్, మర్రి హరీష్, ఏర్పుల వెంకటేష్, యాదయ్య, ఎదుళ్ళ అజిత్ రెడ్డి, కామినేని దుర్గకుమార్, నరేష్, లవకుమార్, రాకేష్, శంకర్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.