Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇండియా కూటమి ఎంపీలకు ఖర్గే విందు..

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 07 Oct 2026, 12:27 PM | NATIONAL
ఇండియా కూటమి ఎంపీలకు ఖర్గే విందు..

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో ఇండియా కూటమి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఇండియా కూటమి ఎంపీలకు ఢిల్లీలో లంచ్‌ ఏర్పాటు చేశారు. జనపథ్‌ రోడ్‌ సమీపంలోని సాగర్‌ రత్న రెస్టారెంట్‌లో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన కూటమి ఎంపీలు ఈ భేటీకి హాజరు కానున్నారు.మంగళవారం రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు అక్కడే ధర్నాకు దిగారు. అనంతరం రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు. ఈ పరిణామాల తర్వాతి రోజే ఖర్గే ఎంపీలతో విందు భేటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంద
తదుపరి కార్యాచరణపై చర్చ
ఈ సమావేశంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన తదుపరి నిరసన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇండియా కూటమిలోని వివిధ పార్టీల నేతలను సమన్వయం చేయడం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లడంపై చర్చ జరగనుంది. ఈసీతో సమావేశం కోరుతూ ఎంపీలు లేఖపై సంతకాలు చేసే అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ, ఎస్‌ఐఆర్‌ అంశాలపై ఇండియా కూటమి ఇప్పటికే ఉమ్మడి ఆందోళనలకు పిలుపునిచ్చింది.