Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలని నిరసన చేసిన సిపిఐ నాయకులు

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలని నిరసన చేసిన సిపిఐ నాయకులు

విద్యుత్ కోతలు నిరసిస్తూ.. సబ్‌స్టేషన్‌ ఎదుట సిపిఐ ధర్నా

ధర్నా చేస్తున్న సిపిఐ నేతలు... వినతి పత్రం అందజేసిన నేతలు

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలని నిరసన చేసిన సిపిఐ నాయకులు - Additional Image


రాజాపేట, అక్టోబర్ 9(ప్రజా అక్షరం):

ఇవి కూడా చదవండి

విద్యుత్ కోతలను నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాజపేట సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం మాట్లాడుతూ రైతులకు వ్యవసాయానికి16 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులతో రైతులు పంటలకు నీరు అందించలేక పంటలు ఎండిపోయి నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని, విద్యుత్‌ కోతలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏ ఇ కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గొల్లూరి రాములు,తరిగొప్పుల సిద్దులు, వెంకటాపురం రమేష్,ఆకుల బాల నరసయ్య, ప్రవీణ్, మూలపోచయ, నంద మల్లేశం, మనుపాటి శ్రీను పాల్గొన్నారు.