Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సిమ్స్ హాస్పిటల్ కంటి శుక్లం,కండ పెరగడం ఆపరేషన్లు

సిమ్స్ హాస్పిటల్ కంటి శుక్లం,కండ పెరగడం ఆపరేషన్లు

*రామగుండం సిమ్స్ హాస్పిటల్ కంటి శుక్లం,కండ పెరగడం ఆపరేషన్లు*

రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని నేత్ర వైద్య విభాగంలో కంటి శుక్లం (క్యాటరాక్ట్) మరియు కంటి కండ పెరగడం (ప్టెరీజిమ్ ) ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి.
గత వారంలో కంటి శుక్లం పగిలి కంటిలో ఒత్తిడి పెరిగిన పేషెంట్ కోల లక్ష్మి 8 ఇంక్లైన్ కాలనీ నుండి ఓపీకి రావడం జరిగింది. దీనిని లెన్స్ ఇన్డ్యూస్డ్ గ్లాకోమా కేసుగా పరిగణిస్తారు.ఇది శుక్లం బాగా ముదిరి పగిలిపోవడం వల్ల వచ్చే ప్రమాదకరమైన సమస్య.ఇటువంటి సంక్లిష్టమైన కేసును సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వంటి పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేయకుండా
ఇక్కడే సిమ్స్ రామగుండంలో డా.సుదీప,డా.గోపీకృష్ణ వైద్య బృందం అక్టోబర్ 9వ తేదీన విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వాహించి డిశ్చార్జ్ చేసాము. ఇటువంటి సంక్లిష్టమైన మరియు క్లిష్టతరమైన కూడా ఇక్కడ చేయడం జరుగుతోంది.
ఈ అక్టోబర్ 15వ తేదీన కంటి పరీక్షల స్క్రీనింగ్ సిమ్స్ రామగుండం ప్రభుత్వం హాస్పిటల్ లో నిర్వహించబడుతుంది. కావున ఈ సదుపాయాలు పెద్దపల్లి జిల్లా వాసులు సద్వినియోగం చేస్కోవల్సిందిగా సిమ్స్ రామగుండం హాస్పిటల్ నేత్ర విభాగం ఇంచార్జ్ డాక్టర్ గోపికృష్ణ తెలిపారు.