Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజావాణి’లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల తిరుగుబాటు..

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 26 Oct 2026, 06:25 PM | TELANGANA, నారాయణపేట
ప్రజావాణి’లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల తిరుగుబాటు..

: ‘ప్రజావాణి’లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల తిరుగుబాటు..

ఆ కార్యదర్శి మాకొద్దు!

నర్వ: అక్టోబర్ 26( ప్రజా అక్షరం న్యూస్)

ఇవి కూడా చదవండి

నర్వ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల వేదిక ఒక పెద్ద పొలిటికల్ సంచలనానికి వేదికైంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలపై ఏకంగా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్, ఉపసర్పంచ్, మరియు వార్డు మెంబర్లు అందరూ కలిసి తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సదరు కార్యదర్శి తమకు వద్దే వద్దని, ఆయన స్థానంలో కొత్త సెక్రెటరీని నియమించాలని డిమాండ్ చేస్తూ వారంతా కలిసి ప్రజావాణిలో లిఖితపూర్వకంగా సంచలన దరఖాస్తు అందజేశారు. ఈ పరిణామంతో నర్వ మండలంలోని
పాలకవర్గాన్ని బేఖాతరు చేస్తూ ఏకపక్ష నిర్ణయాలు:
గ్రామ పంచాయతీ కార్యదర్శి పాలకవర్గాన్ని పూర్తిగా అవమానిస్తున్నారని, సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు తమ దరఖాస్తులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభలు నిర్వహించకుండా, వార్డు సభ్యుల అభిప్రాయాలను తీసుకోకుండా తన ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధిని పూర్తిగా కుంటుపరుస్తున్నారని ధ్వజమెత్తారు. పాలకవర్గ అధికారాలను కించపరుస్తూ ఒంటెద్దు పోకడలు పోతున్న సదరు కార్యదర్శిని వెంటనే ఇక్కడి నుండి బదిలీ చేసి, గ్రామానికి కొత్త కార్యదర్శిని కేటాయించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం:
గ్రామ సర్పంచ్, రవి కుమార్ రెడ్డి ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అంతా ఏకతాటిపైకి వచ్చి సామూహికంగా కొత్త సెక్రెటరీ కావాలని దరఖాస్తు ఇవ్వడంతో ప్రజావాణి అధికారులు ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. పంచాయతీ పాలకవర్గాన్ని కాదని ఏకపక్షంగా వ్యవహరించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, నూతన కార్యదర్శి నియామకం మరియు బదిలీ వ్యవహారాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీడీవో శ్రీనివాసులు హామీ ఇచ్చారు. కాగా, నర్వ మండల పరిధిలోని లంకాల గ్రామం లొ ప్రజాప్రతినిధులు అంతా కలిసి కార్యదర్శిపై చేసిన ఈ సంచలన ఫిర్యాదు ఇప్పుడు టాప్ హాట్ టాపిక్‌గా మారింది.