Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ను వేగవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 28 Oct 2026, 10:22 PM | తెలంగాణ, నల్గొండ, రాజకీయం
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ను వేగవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ను వేగవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ను వేగవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి


చిట్యాల,అక్టోబర్ 28 (ప్రజా అక్షరం ప్రతినిధి):

ఇవి కూడా చదవండి

చిట్యాల పట్టణ కేంద్రంలోని బి.ఎన్. రెడ్డి గార్డెన్స్‌లో బుధవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం
చేయాలని సూచించారు.ఓటరు నమోదు దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో, గడువులోగా అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. డిగ్రీ పూర్తి చేసుకుని మూడేళ్లు పూర్తయిన అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు డివిజన్, మండల, గ్రామాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు ఎస్కే షబానా అజీముద్దీన్, నిమ్మన గోటి శ్రీనివాస్, మండల నాయకులు బొబ్బలి శివ శంకర్ రెడ్డి, సుంకరి యాదగిరి గౌడ్, మెండే సైదులు, ఆగు అశోక్, జనగాం నరసింహ గౌడ్, రుద్రారపు బిక్షం, ఉయ్యాల నాగరాజు, ప్రతాపరెడ్డి, లింగయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.