Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మల్కాజిగిరి నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు ఓటు బచావో – దేస్కో బచావో

మల్కాజిగిరి నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు  ఓటు బచావో – దేస్కో బచావో

మల్కాజిగిరి నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు
ఓటు బచావో – దేస్కో బచావో

దాదాపు 100 కార్లలో ఢిల్లీకి పయనం.. మహారాష్ట్ర మాజీ మంత్రి విజయ్‌భావు వడెట్టివార్‌తో కాంగ్రెస్ నాయకుల భేటీ

మల్కాజిగిరి నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు  ఓటు బచావో – దేస్కో బచావో - Additional Image

మల్కాజిగిరి, అక్టోబరు 31 అక్షరం:

ఇవి కూడా చదవండి

చలో ఢిల్లీ’లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో దాదాపు 100 కార్లలో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి.ఈ క్రమంలో మహారాష్ట్రలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మహారాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే విజయ్‌భావు వడెట్టివార్‌ను నాగపూర్ లో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంపై చర్చించారు.

ఓటర్ల జాబితా నుంచి ఎలాంటి సరైన కారణాలు లేకుండా ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగిస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశ రాజ్యాంగ విలువలను, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో నిర్వహిస్తున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి పయనమైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నక్క ప్రభాకర్ గౌడ్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, గుండా నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.