Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కూలీల ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 07 Oct 2026, 07:35 PM | TELANGANA
కూలీల ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

దౌల్తాబాద్,అక్టోబర్ 7 (ప్రజా అక్షరం )
పెయింటింగ్‌ పనుల కోసం కూలీలను తీసుకెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటన దౌల్తాబాద్ మండలం లింగరాజ్‌పల్లి శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు గాయపడ్డారు. సూరంపల్లి గ్రామంలో పెయింటింగ్‌ పనుల నిమిత్తం కూలీలతో ఆటో వెళ్తుండగా లింగరాజ్‌పల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో తూప్రాన్‌ మండల కేంద్రానికి చెందిన ఎల్లం కుడి భుజానికి తీవ్ర గాయమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జితేందర్‌ కుడికాలి మడమకు గాయమైందని తెలిసింది.
సమాచారం అందుకున్న 108 అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం తూప్రాన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు 108 సిబ్బంది ఈఎంటీ భాను, పైలట్‌ నర్సింలు.