Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

*వలిగొండ అక్టోబర్ 9 ప్రజా అక్షరం ప్రతినిధి*

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ యాదగిరిగుట్ట మండలం సైదాపూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను సందర్శించి, అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని గౌరవప్రదంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరేడ్ నిర్వహణ, బందోబస్తు, వేదిక ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాలు, కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకునే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.

ఇవి కూడా చదవండి