Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 31 Oct 2026, 01:45 PM | యాదాద్రి భువనగిరి
జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
– వనం ఉపేందర్
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు.


రామన్నపేట అక్టోబర్ 31(ప్రజా అక్షరం):

జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి - Additional Image

నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిలభారత 36వ రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కక్కిరేణి గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, రైతుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం జరిగే జాతీయ మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు వేముల సైదులు, శాఖ కార్యదర్శి కన్నబోయిన యాదయ్య, రైతులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య, శ్రీను, భిక్షం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి